నేలకొండపల్లిలో ఉద్రిక్తత.. నిలిచిన వాహనాలు

నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం రైస్ మిల్లులో యువతి మృతి చెందడంతో మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. మృతురాలి బంధువులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, న్యాయం జరిగే వరకు కదిలేది లేదని వారు భీష్మించుకోవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీనితో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్