తిరుమలాయపాలెం మండలం తాళ్లచెరువులోని తన వ్యవసాయ క్షేత్రాన్ని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా తన భూమిలో పామాయిల్ సాగు చేపట్టగా. ఆయన పామాయిల్ మొక్క నాటారు. రైతులు ఎప్పుడూ ఒకే విధమైన పంట కాకుండా నూతన పంటల సాగువైపు దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ మంది రైతులు పామాయిల్ సాగు చేస్తున్నారని ఆయన తెలిపారు.