10 గంటల పని దినం పెంచడానికి తీసుకువచ్చిన జీవో నెంబర్ 282ను వెంటనే రద్దు చేయాలని CITU జిల్లా నాయకుడు షేక్ బషీరుద్దీన్ డిమాండ్ చేశారు. తిరుమలాయపాలెం మండల కేంద్రంలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఆనాడు చికాగో నగరంలో కార్మికుల పోరాటంతో 8 గంటల పని వచ్చిందని, ఇప్పుడు ప్రభుత్వాలు దానిని మార్చి 10 గంటల పనిని తీసుకొస్తున్నారన్నారు. కార్మికుల వ్యతిరేక జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.