తిరుమలాయపాలెం మండలం బచ్చోడుతండాలో 16 ఏళ్ల బాలికను మాయమాటలతో లొంగదీసుకుని ఆమె గర్భానికి కారణమైన వ్యక్తిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. బాలిక 8వ తరగతి పూర్తి చేశాక ఇంటి వద్దే ఉంటోంది. అదే తండాకు చెందిన ధరావత్ బాలు ఆమెకు మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకోవడం గర్భం దాల్చింది. ఈ విషయమై బాలిక తల్లి ఫిర్యాదుతో బాలుపై కేసు నమోదు చేసి, బాలికను బాలికల సదనంకు పంపించినట్లు పోలీసులు తెలిపారు.