ఖమ్మం: బైకును ఢీకొన్న లారీ.. వ్యక్తి స్పాట్ డెడ్

చింతపల్లి జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాకు చెందిన బానోత్ కుమార్(24) ఖమ్మంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. డ్యూటీ అనంతరం బైకుపై ఇంటికి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్