తిరుమలాయపాలెం: బడి తెరిచే నాటికి యూనిఫామ్ సిద్ధం చేయాలి

వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు యూనిఫామ్ సిద్దం చేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ సూచించారు. తిరుమలాయపాలెంలో శుక్రవారం ఆమె పర్యటించారు. తొలుత ఎంపీడిఓ కార్యాలయానికి వెళ్లిన ఆమె రాజీవ్ యువ వికాసం పథకం కోసం అందిన దరఖాస్తులపై ఆరా తీశారు. ఆ తర్వాత ఐకేపీ కార్యాలయానికి వెళ్లగా, పాఠశాల విద్యార్థులకు, యూనిఫామ్ కుడుతున్న మహిళలతో మాట్లాడారు. ఈసారి యూనిఫామ్ త్వరగా సిద్ధం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్