పాలేరు రిజర్వాయర్ లో నీటి నిల్వలు తగ్గడంతో తాగు నీటి సమస్య ఎదురుకాకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 3వేల క్యూసెక్కుల నీటి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో శుక్రవారం సాగునీటి శాఖ అధికారులు ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా నీరు విడుదల చేశారు. మొదట వేయి క్యూసెక్కులు విడుదల చేయగా, క్రమంగా మూడు వేల క్యూసెక్కులకు పెంచుతూ ఐదు రోజులు విడుదల చేస్తామని డ్యాం ఎస్ఈ మల్లికార్జున్ తెలిపారు.