ఆళ్లపల్లి మండలం అనంతోగులో నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యాం వద్ద శుక్రవారం చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సోమేశ్వర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల మండలం మామకన్ను గ్రామానికి చెందిన కల్తీ ప్రకాశ్ చేపల వేటకు వెళ్లారు. చెక్ డ్యాంలో ఉన్న నీళ్లలో వలవేసి, వల తీయడానికి నీళ్లలో దూకాడు. ఆ చేపల వలె తనకు యమపాశమై చుట్టుకుని మృతి చెందాడు. ప్రకాశ్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.