అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రుడిని మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.