బూర్గంపాడ్: ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపనలో అపశృతి

బూర్గంపాడు సారపాకలోని వినాయకుడి గుడి వద్ద ఆదివారం ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాతి ధ్వజస్తంభాన్ని క్రేన్ సాయంతో పునఃప్రతిష్టించే ప్రయత్నంలో అది మధ్యకు విరిగిపడింది. ఈ ఘటనలో కొందరు భక్తులకు గాయాలయ్యాయి. ఈ వేడుకకు పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్