భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ వద్ద కిన్నెరసాని వాగు సమీపంలోని గుడుంబా తయారీ స్థావరాలపై తెలంగాణ, ఆంధ్రా రాష్ట్ర అబ్కారీ, పోలీస్ అధికారులు శుక్రవారం ఉదయం దాడులు నిర్వహించారు. పెద్ద మొత్తంలో సారా, సామాగ్రి ధ్వంసం చేశారు. సరఫరా కేంద్రాలపై నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.