సారపాకలో నాణ్యత లేకుండా సీసీ రోడ్డు పనులా?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం, బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని సుందరయ్యనగర్‌లో చేపడుతున్న సీసీ రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సిమెంటు రోడ్డు వేయడానికి ముందు గ్రావెల్, పీసీసీ వేసి రోలర్‌తో కాంపాక్షన్ చేయాల్సి ఉండగా, వాటిని విస్మరించి నేరుగా సీసీ రోడ్డు వేస్తున్నారని వారు చెబుతున్నారు. అధికారులు పనుల నాణ్యతను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్