కొత్తగూడెం: రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా

గురువారం ఆళ్లపల్లి మండల కేంద్రంలో ట్రాక్టర్ బోల్తా కొట్టి పడిగ సూర్య ప్రకాష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తునికిబండల గ్రామం వైపు వెళ్తుండగా, పాతూరు గ్రామపంచాయతీ వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇంజన్ భాగం సూర్య ప్రకాష్ నడుముపై పడటంతో గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు జేసీబీ సహాయంతో క్షతగాత్రుడిని బయటకు తీసి 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ రేవంత్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్