బూర్గంపాడు మండలం సారపాక వెస్ట్గేట్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.