అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

బూర్గంపాడు మండలం సారపాకలో అప్పుల బాధతో పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సారపాకకు చెందిన కొండేటి సాయి (30) ఆర్థిక ఇబ్బందులతో అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఈ నెల 1న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు ఖమ్మంలోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తల్లి నాగమణి ఫిర్యాదు మేరకు బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్