చెరువులో పడి వ్యక్తి గల్లంతైన ఘటన బుధవారం మణుగూరు మండలం రేగులగండి చెరువులో చోటుచేసుకుంది. సింగరేణిలో EP ఆపరేటర్ గా పని చేస్తున్న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన సుంకరి శ్రీనివాస్ సహోద్యుగులతో కలిసి చెరువు వద్ద విందు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత చెరువులో సరదాగా ఈత కొడుతుండగా అకస్మాత్తుగా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది.