ములకలపల్లి మండలంలో 17 ఏళ్ల బాలికను మోసం చేసి గర్భవతిని చేసిన ఘటనపై బుధవారం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఏడాది క్రితం దసరా సెలవుల్లో సత్యంపేటకు చెందిన వేణు మాయమాటలతో బాలికను లోబరచుకున్నాడు. గర్భం వచ్చాక బెదిరించాడు. అస్వస్థతతో ఆసుపత్రికి వెళ్లినప్పుడు విషయం బయటపడింది. బాధిత తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.