కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామంలో విద్యుత్ తీగలు, స్తంభాలను ఆనుకొని చెట్ల కొమ్మలు, తాటి మట్టలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. తీగలకు తాటి ఆకులు తగలడం వల్ల కరెంట్ వైర్లు ఒకదానికొకటి దగ్గరయ్యాయి. వర్షం వచ్చినా, గాలులు వీచినా షార్ట్ సర్క్యూట్ జరిగి తీవ్ర ప్రమాదం జరిగే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగక ముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, వైర్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలు, తాటిమట్ట లను వెంటనే తొలగించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.