పినపాక మండల పరిధిలోని పిట్టతోగు అటవీ ప్రాంతంలో జూదం ఆడుతున్న 12 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి 12 మందిని గుర్తించామన్నారు. వారి నుంచి రూ. 3. 11 లక్షల నగదు, కారు, 11 ద్విచక్ర వాహనాలు, 12 చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరో ఏడుగురు పరారైనట్లు పేర్కొన్నారు.