పినపాక: లారీ ఆటోను ఢీ కొట్టిన ప్రమాదంలో మరో మహిళ మృతి

పినపాక మండలంలో సోమవారం లారీ ఆటోను ఢీకొన్న ఘోర ప్రమాదంలో మరో మహిళ మృతి చెందింది. గొట్టెల్ల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, చికిత్స పొందుతున్న మరో మహిళ పరిస్థితి విషమించడంతో వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్