పినపాక మండలం బయ్యారంలో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నర్సయ్య గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పస్రాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నరసయ్య భార్య సునీత ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తుంది. భార్యాభర్తల మధ్య నెలకొన్న గొడవల వల్లనే నర్సయ్య ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. భార్య సునీత పై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.