మణుగూరు మండలంలోని కూనవరం పీవీ కాలనీలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ ముజాఫర్‌కు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని కొండచిలువను పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు. దీంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.