బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పత్తి విష్ణువర్ధన్‌రెడ్డి హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ హోదా పొందిన రెండో వ్యక్తిగా నిలిచారు. గతంలో ఉమ్మడి ఏపీ, తెలంగాణ హైకోర్టుకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా, ఎన్ఐఏ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా న్యాయవాదుల సమస్యలు, హక్కులు, సంక్షేమం కోసం పనిచేశారు.