బూర్గంపాడు మండలంలోని టేగులచెరువు గ్రామంలో గణేష్ నవరాత్రి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తేజావత్ భాగ్యమ్మ(55) మంగళవారం రాత్రి గణేష్ మండపం వద్ద వేడుకల్లో పాల్గొని డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు. ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.