తల్లాడ మహిళా మార్ట్ పనులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

తల్లాడలో నిర్మాణంలో ఉన్న మహిళా మార్ట్ పనులను జిల్లా అదనపు కలెక్టర్ డా. శ్రీజ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిని ఎంపీడీవో శ్రీధర్ రాజును అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలు, గిరిజనుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి మహిళా మార్ట్ దోహదపడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕