సత్తుపల్లిలో ఓటరు జాబితా సవరణపై అవగాహన సదస్సు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి 21వ వార్డులో సోమవారం ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మట్టా దయానంద్, బూత్ లెవల్ అధికారులతో (BLO) మాట్లాడి, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. SIR ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఎలాంటి అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్