గండుగులపల్లి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో బండి గురునాథరెడ్డి భేటీ

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో రాజకీయ విశ్లేషకులు, వేంసూరు మండల సీనియర్ నేత బండి గురునాథరెడ్డి ఆదివారం కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలో గల ప్రస్తుత పరిస్థితులను బండి తుమ్మలకు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు మెరుగుపడాలని గురునాథరెడ్డి సూచించారు. ఈ భేటీలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్