సత్తుపల్లి బస్టాండ్లో యాచకుడి మృతి

సత్తుపల్లి బస్టాండ్‌లో కాకర్లపల్లికి చెందిన శీను (55) అనే యాచకుడు మృతి చెందాడు. కొద్దిరోజులుగా బస్టాండ్ పరిసరాల్లోనే యాచన చేస్తూ జీవిస్తున్న ఆయన, గురువారం అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు అనారోగ్యంతో చనిపోయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్