ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం పంచాయతీలో ఆదివారం రామ గోవిందాపురం రేకుల షెడ్ లో షరీఫ్ అనే వ్యక్తి అక్రమంగా గోవులను బంధించి గోవధ జరుపుతున్నారని గ్రామస్తులు, బిజెపి పార్టీ వారికి సమాచారం అందించారు. దీంతో బిజెపి పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు షెడ్ ని పరిశీలించి 35 పైగా ఉన్న ఆవులను, ఎద్దులను, లేగ దూడలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. గోవులను కొనుగోలు చేసిన రసీదులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని పోలీసులు తెలుసుకుంటారని, గోమాతను పూజించే సంస్కృతి ఉన్న మన దేశంలో విరుద్ధంగా ఇక్కడ గోవులను వధిస్తున్నారని, మూగజీవాలకు రక్షణ లేకుండా పోయిందని, ఒకవేళ అక్రమంగా గోవధ జరిగితే వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు నంబూరి రామలింగేశ్వర రావు తెలిపారు.