మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం తల్లాడ రింగ్ రోడ్డు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, సర్పంచి పెరిక నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే బురదజల్లుతోందని నాయకులు ధ్వజమెత్తారు. కక్షపూరిత రాజకీయాలను వీడాలని వారు డిమాండ్ చేశారు.