వేంసూరు మండలం భరణిపాడు గ్రామంలో శనివారం జరిగిన పలు బతకమ్మ వేడుకల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మహిళలతో కలిసి బతకమ్మ ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసి వైస్ చైర్మన్ గొర్ల వెంకటప్ప రెడ్డి, వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, మహిళా, యూత్, ప్రజలు పాల్గొన్నారు.