చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

గొర్రెలను మేతకు తీసుకెళ్లి వస్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన కొప్పుల చెన్నారావు (53) తన భార్య కుమారితో కలిసి మంగళవారం గొర్రెలను మేపుకొని సాయంత్రం ఇంటికి వస్తుండగా రుద్రాక్షపల్లి వైపు నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలైన చెన్నారావును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్