సత్తుపల్లి పట్టణంలోని 7, 9, 16, 19, 20, 23వ వార్డుల్లో రూ. 3 కోట్ల వ్యయంతో చేపట్టన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు. పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.