ఓటు హక్కు ప్రాధాన్యతపై వ్యాసరచన పోటీలు - ఎమ్మార్వో

ఓటు హక్కు, దాని ప్రాధాన్యతపై ఈ నెల 6న వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తల్లాడ తహశీల్దార్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోటీలు జరుగుతాయన్నారు. పాఠశాల స్థాయిలో 500–800, కళాశాల స్థాయిలో 800–1200 పదాలతో వ్యాసం రాయాలి. 50 మార్కులప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి విద్యాసంస్థ నుంచి ఇద్దరు విద్యార్థులను పంపాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕