సత్తుపల్లిలో రైతు అవగాహన సదస్సు

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం సత్తుపల్లిలోని లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హాల్‌లో రైతు అవగాహన సదస్సు జరిగింది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి పాల్గొన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఆధునిక సాగు పద్ధతులను, ముఖ్యంగా ఆయిల్ పామ్ వంటి ఉద్యానవన పంటలను అవలంబించడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్