జలవనరుల శాఖ డివిజన్ కార్యాలయం వద్ద రైతుల నిరసన

సాగునీరు అందించాలని కల్లూరు జలవనరుల డివిజన్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపి ఈఈ లక్ష్మణరావుకు, ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓకు వినతిపత్రం అందజేశారు. జిల్లా నాయకుడు తాతా భాస్కర్ రావు మాట్లాడుతూ. సాగర్ ఎడమ కాలువకు గండ్లు పడి 18 రోజులు కావస్తున్నా ప్రభుత్వం గండ్లు పూడ్చకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఒక్కో ఎకరానికి రూ. 20వేలు పెట్టి సాగుచేస్తే సాగునీరు లేక పంటంతా ఎండిపోతుందన్నారు.

సంబంధిత పోస్ట్