కిష్టారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకుల దుర్మరణం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ గ్రామం నుండి సత్తుపల్లికి వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. మృతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ వాసులుగా గుర్తించారు. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్