కల్లూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో మద్యం మత్తులో తండ్రి కన్నకొడుకును హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఆటో డ్రైవర్ కొత్తపల్లి సీతారాములు తన కుమారుడు కిరణ్ కుమార్(30)పై దాడి చేసి తలపై బలంగా కొట్టడంతో అతడు మృతి చెందాడు. ఘటన అనంతరం నిందితుడు ఆటోలో పరారయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.