కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల మృతి చెందిన వార్డు సభ్యులు కర్నాటి శివ శంకర్ రెడ్డి దశదిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. శివ శంకర్ రెడ్డి చిత్రపటానికి పూలతో నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.