ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలోని కల్లూరు మున్సిపాలిటీ పరిధి పుల్లయ్య బంజార గ్రామానికి చెందిన బోబోలు నాగేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం వారి స్వగృహానికి వెళ్లి, నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.