బాలంపేటలో రూ. 15116 పలికిన గణేష్ లడ్డూ

సత్తుపల్లి మండలం బాలపేటలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ కమిటీ నిర్వహించిన లడ్డూ వేలంలో పాలపు నాగయ్య రూ. 1,51,116కు లడ్డూను ఆదివారం దక్కించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా మేళతాళాలు, మహిళల కోలాటాల నడుమ టపాసులు కాల్చుకుంటూ పురవీధులలో తిరుగుతూ నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్

✕
✕