ఉపాధి హామీ పనుల్లో గ్రామ పంచాయతీ మ్యాపింగ్

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం భవన పాలెం గ్రామపంచాయతీలో సోమవారం ఉపాధి హామీ పనుల్లో భాగంగా గ్రామంలోని రోడ్లు, చెరువులు, ప్రభుత్వ ఆస్తులు ఇతర అభివృద్ధి పనుల స్థానం గుర్తించడానికి మ్యాపింగ్ చేశారు. పనులను ప్లాన్ చేయడం, కొలతలు నమోదు చేయడం, పనుల పురోగతిని పర్యవేక్షించడం కోసం మ్యాపింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ సూర్య వినోద్ కుమార్, గ్రామ సర్పంచ్ కృష్ణకుమారి, రైతులు, ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕