బాలంపేటలో ఘనంగా వినాయక నిమజ్జనం

తల్లాడ మండలం బాలంపేటలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీవిద్య గణేష్ యూత్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి, గణపతి బప్పా మోరియా నినాదాలతో డప్పు మేళాల మధ్య గణనాథుడిని పురవీధుల్లో ఊరేగించారు. విగ్రహ దాత తోగరు కేశవరావుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్

✕
✕