కల్లూరు: సాగర్ కాలువకు నీళ్లు వదలాలి

నాగార్జునసాగర్ కాల్వకు నీళ్లు విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ సభ్యులు పసుమర్తి చందర్రావు డిమాండ్ చేశారు. కల్లూరులో ఆయన మాట్లాడుతూ. రైతులు వర్షాన్ని నమ్ముకొని 2 వారాలు ముందుగా వరి సాగు చేశారని, నీళ్లు లేక ఆయకట్టు వరి పంట ఎండి పోతుందని, వెంటనే సాగునీరు అందించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ZPTC యాకుబ్ అలీ, బంకాబాబు, వెంకటేశ్వరరావు, జక్కంపూడి కిషోర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్