కల్లూరు మండలం పెద్ద కోరుకొండి గ్రామంలో తాగునీరు సరఫరా చేసే విద్యుత్ మోటార్లకు అమర్చిన సర్వీస్ వైర్లు చోరీకి గురవుతున్నాయని ఆ గ్రామ పంచాయతీ సెక్రెటరీ రామకృష్ణారెడ్డి తెలిపారు. గత రాత్రి గుర్తుతెలియని దుండగులు సుమారు రూ. 10 వేల విలువైన సర్వీస్ వైర్లను దొంగలించారని సెక్రెటరీ తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.