కల్లూరు: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కల్లూరు మండలంలో సుమారు రూ. 15 కోట్లతో పలు అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 2 కోట్లతో నారాయణపురం - పేరువంచ, రూ. 4 కోట్లతో నారాయణపురం-రామకృష్ణపురం, రూ. 7 కోట్లతో పేరువంచ- కుప్పనకుంట్ల, రూ. 2 కోట్లతో కొత్త నారాయణపురం -ఎన్ఎస్పీకెనాల్ లిఫ్ట్ వరకు బీటీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతున్నామని, వంద శాతం ప్రతి పల్లెకు మౌలిక వసతులు కల్పించే వరకు విశ్రమించేది లేదని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్