కల్లూరు: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

కొనుగోలు కేంద్రాలలో రైతులు తరలించిన ధాన్యాన్ని నిబంధన ప్రకారం వేగంగా కొనుగోలు చేయాలని సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ సూచించారు. శనివారం కల్లూరు మండలం పుల్లయ్య బంజర రోడ్ శివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రెండు కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ పులి సాంబశివుడు కూడా ఆయనతో పాటు ఉన్నారు.

సంబంధిత పోస్ట్