ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని సొసైటీ ద్వారా ఎరువులు పంపిణీ జరుగుతున్నా, దూర గ్రామాల రైతులకు టోకెన్లు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టోకెన్ల వ్యవస్థ ఉన్నప్పటికీ సమాచారం అందకపోవడంతో వారు వంచితులవుతున్నారు. స్థానిక AEOల ద్వారా గానీ, సోషల్ మీడియా ద్వారా గానీ ముందస్తుగా టోకెన్లు, పంపిణీ సమయంపై సమాచారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.