కల్లూరు: ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

కల్లూరు మండలం యజ్ఞ నారాయణపురం గ్రామంలో తెలుగుదేశం యూత్ ఆధ్వర్యంలో 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ చేసి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. టీడీపీ హయాంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు లబ్ధి పొందారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్