ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. కొదుమూరు నుంచి సత్తుపల్లి వరకు హైవేపై ప్రయాణించి, పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. హైవే పూర్తయితే ఖమ్మం, ఏపీ మధ్య రాకపోకలు సులభమై వ్యాపార, రవాణా రంగాలకు ఊతమిస్తుందని మంత్రి పేర్కొన్నారు. కొన్నిచోట్ల హైవే విస్తరణ, రోడ్డు లెవలింగ్, వంతెన నిర్మాణాలపై అధికారులతో సమీక్షించారు.